మలక్‌పేట మెట్రో స్టేషన్ వద్ద తగలబడిన బైకులు (Video)
హైదరాబాద్ నగరంలోని మలక్‌పేట మెట్రో రైల్వే స్టేషన్ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ మెట్రో స్టేషన్ కింద పార్కు చేసిన బైకులు తగలబడిపోయాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలముకున్నాయి. ఈ అగ్నిప్రమాదంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా, వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ అగ్నిప్రమాదం ఎలా జరిగిందన్న అంశంపై విచారణ జరుపుతున్నారు. ఇక్కడ పార్కింగ్ చేసిన బైకుల్లో ఎలక్ట్రిక్ బైకులోని బ్యాటరీ పేలి పోవడం వల్ల ప్రమాదం జరిగిందా అనే కోణంలో ఆలోచన చేస్తున్నారు.
మలక్‌పేట్ మెట్రో స్టేషన్ వద్ద అగ్నిప్రమాదం
— Telugu Scribe (@TeluguScribe) December 6, 2024
హైదరాబాద్ - మలక్‌పేట్ మెట్రో స్టేషన్ కింద పార్క్ చేసిన బైక్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. బైకులు తగలబడటంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి.
దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
ఘటనా… pic.twitter.com/FRiO7NkICJ
