ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 6 డిశెంబరు 2024 (14:21 IST)

Benefit Shows బెన్ఫిట్ షోలకు అనుమతి ఇవ్వం : మంత్రి కోమటిరెడ్డి

komatireddy venkatreddy
Pushpa-2 Incident: Minister Komatireddy's Sensational Decision on Benefit Shows ఇకపై బెన్ఫిట్ లేదా ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వబోమని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. బుధవారం రాత్రి "పుష్ప-2" బెన్ఫిట్ ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు తీవ్ర అస్వస్థతకుగురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
ఈ ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. బెనిఫిట్ షోస్‌ను పూర్తిగా ఆపేస్తామని కోమటిరెడ్డి చెప్పారు. ఇకపై బిగ్ బడ్జెట్ సినిమాలపై ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుందన్నారు. సంక్రాంతికి రాబోయే సినిమాలపై ఇది పడుతుందన్నారు. పైగా, శాంతిభద్రతలకు కూడా విఘాతం కలుగుతుందన్నారు. కుటుంబంతో కలిసి సరదాగా సినిమా చూసేందుకు వచ్చినవారు తమ కుటుంబ సభ్యురాలిని కోల్పోవడం తనను ఎంతగానో బాధించిందన్నారు. 
 
ఇదిలావుంటే, రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాను ఫెస్టివల్ సీజన్‌లో రిలీజ్ చేయటంతో పాటు ప్రత్యేక షోల ద్వారా మంచి ఓపెనింగ్ రాబట్టాలనేది దిల్ రాజు ప్రయత్నంగా ఉంది. కానీ, మంత్రి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలతో పరిస్థితి తారుమారయ్యేలా కనిపిస్తుంది. విడుదల సమయానికి దిల్ రాజు మరలా ప్రభుత్వ పెద్దలను ఓప్పించి జివోలు ఇప్పించుకోగలరా అనేది చూడాల్సివుంది.