1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Guntur District Couple Cheating Rs.1 Cr from Techie

ఫేస్‌బుక్ పరిచయం : పెళ్లి పేరుతో రూ.కోటి మోసం

Guntur
ఇటీవలి కాలంలో ఫేస్‌బుక్ జరిగే పరిచయాలు చివరకు విషాదాంతంగా ముగుస్తున్నాయి. తాజాగా ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ టెక్కీ నుంచి ఓ మహిళ ఏకంగా రూ.కోటి మేరకు దోచుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన యర్రగడ్డ దాసు, జ్యోతి అనే దంపతులు కళ్యాణి శ్రీ పేరుతో ఓ ఫేస్‌బుక్ ఖాతాను ప్రారంభించి, అందుబాటులోకి వచ్చిన వారితో చాటింగ్ చేయసాగారు. అలా హైదరాబాద్ నగరానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీరు వీరికి పరిచయమయ్యారు. 
 
అతనితో జ్యోతి యేడాదిన్నరపాటు ప్రేమాయణం కొనసాగించింది. పెళ్లి చేసుకుంటానని దాసును జ్యోతి నమ్మించింది. చేతి ఖర్చుల కోసం దశల వారీగా రూ.కోటి వరకు తీసుకుంది. ఆ తర్వాత ఫేస్‌బుక్ ఖాతా డీయాక్టివేట్ అయింది. 
 
దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న టెక్కీ పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఫేస్‌బుక్ ఖాతా ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితులను గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన వారిగా గుర్తించి వారిని అరెస్టు చేశారు. వీరిని మంగళవారం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
కొండపల్లి ఛైర్మన్ ఎన్నిక పూర్తి.. వైకాపా నుంచి జోగి రాము