మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 మే 2022 (20:02 IST)

గుంటూరులో తొమ్మిదో తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

victim girl
ఏపీలో బాలికలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా నల్లపాడు స్టేషన్ పరిధిలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. 
 
తెలిసిన వ్యక్తికి ఆరోగ్యం బాగోలేదని నమ్మించి బాలికను ఇంట్లో నుంచి తీసుకెళ్లాడు యువకుడు. ఇన్నర్ రింగ్ రోడ్డులోని ఓ లాడ్జిలో బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు తొమ్మిదో తరగతి విద్యార్థిని అని పోలీసులు తెలిపారు. 
 
ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. బాధితురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.