సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 మే 2022 (08:38 IST)

బాలికను రేప్ చేసిన 80 యేళ్ల వృద్ధుడు - డిజిటల్ కేసు నమోదు

victim
నోయిడాలో తమ ఇంట్లో పని చేసే 17 యేళ్ల బాలికపై 80 యేళ్ల వృద్ధుడు లైంగికంగా వేధించాడు. దీంతో అతనిపై నోయిడా పోలీసులు డిజిటల్ కేసును నమోదు చేశారు. అంటే వీడియోలు, ఫోటోలు, ఆడియో రికార్డు ఆధారంగా కేసు నమోదు చేశారు. 
 
అలహాబాద్ నగరానికి చెందిన మౌరిస్ రౌడర్ అనే 81 యేళ్ల వృద్ధుడు నోయిడాలో పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడ ఆయన తన స్నేహితురాలితో కలిసి ఉంటున్నాడు. వీరిద్దరూ కలిసి ఇంట్లో పని చేసేందుకు 17 యేళ్ల బాలికను పెట్టుకున్నారు. ఈ బాలికను మౌరిస్ లైంగికంగా వేధించసాగాడు. 
 
కొన్నేళ్లుగా ఈ వేధింపులు సాగుతున్నప్పటికీ తాజాగా మరింతగా ఎక్కువయ్యాయి. వీటిని భరించలేని ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇందుకు సంబంధించి తన వద్ద ఉన్న వీడియోలు, ఆడియో రికార్డులు, ఫోటోలను ఆ బాలిక పోలీసులకు సమర్పించింది. వీటి ఆధారంగా చేసుకుని పోలీసులు వృద్ధుడిపై డిజిటల్ రేప్‌ కేసును నమోదు చేశారు.