1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 18 మే 2022 (10:02 IST)

ప్రియురాలికి హాయ్ చెప్పాడని కత్తితో దాడి, ఆర్తనాదాలు పెట్టిన యువకుడు

knife
తన ప్రియురాలికి హాయ్ చెప్పాడన్న కోపంతో పదో తరగతి విద్యార్థిపై మరో యువకుడు కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని లంగర్ హౌజులో చోటుచేసుకుంది.

 
పూర్తి వివరాల్లోకి వెళితే... దుర్గాప్రసాద్ అనే పదోతరగతి విద్యార్థి తన ప్రియురాలికి హాయ్ అంటూ చెప్పాడని మరో విద్యార్థి ఆగ్రహంతో రగిలిపోయాడు. అతడిని ఎలాగైనా చంపేయాలని నిశ్చయించుకున్న సదరు విద్యార్థి తన స్నేహితుడు సాయం కోరాడు. ఇద్దరూ కలిసి దుర్గాప్రసాద్ కి మాయమాటలు చెప్పి అత్తాపూర్ లోని మూసీ వద్దకు తీసుకుని వెళ్లారు.

 
అక్కడ ఇద్దరూ కలిసి దుర్గాప్రసాద్ పైన కత్తులతో దాడి చేయడం ప్రారంభించారు. బాధితుడు గట్టిగా ఆర్తనాదాలు చేయడంతో స్థానికులు అక్కడికి వచ్చారు. ఈలోపే దాడి చేసిన ఇద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.