ఆదివారం, 24 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 7 మే 2022 (13:54 IST)

యువతిని నమ్మించి న్యూడ్ ఫోటోలు, ఆమె తండ్రికి షేర్ చేసి బ్లాక్‌మెయిలింగ్

rape
పెళ్లాడుతానంటూ ఓ యువతిని నమ్మించి ఆమె నగ్న ఫోటోలు తీసాడు ఓ యువకుడు. ఈ ఘటన విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో జరిగింది.


గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న యువతితో ఇంజినీరింగ్ అసిస్టెంటుగా పనిచేస్తున్న నవీన్ అనే యువకుడు పరిచయం చేసుకున్నాడు. మెల్లగా ఆమెకి మరింత సన్నిహితంగా మారి, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఈ క్రమంలో ఆమెను దుస్తులు లేకుండా నగ్న ఫోటోలు తీసాడు.

 
ఈ ఫోటోలను ఆమె తండ్రికి పంపి బ్లాక్ మెయిల్ చేసాడు. దీనితో షాక్ తిన్న యువతి తండ్రి వెంటనే కుమార్తెను వెంటబెట్టుకుని వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.