1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Heavy rain likely in Andhra Pradesh for next three days

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

rain
పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకునివున్న నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ఇది మరింతగా బలపడనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశంచే అవకాశం ఉందని, దీని ఫలితంగా వచ్చే 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. తదుపరి 24 గంటల్లో ఇది వాయుగుండంగా కొనసాగుతూ ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తుందని ఏపీ ఎస్డీఎంఏ తెలిపింది. 
 
దీని ప్రభావంతో ఈ నెల 21వతేదీన పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అనకాపల్లి, విశాఖ, అల్లూరు సీతారామరాజు, తూర్పు గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, ఏలూరు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, వైఎస్ఆర్, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ఎస్డీఎంఏ తాజాగా విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
తర్వాతి కథనం
మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్