1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Husband Parakala Prabhakar criticizes Nirmala Sitharaman's comments

నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై భర్త పరకాల ప్రభాకర్ విమర్శలు

Parakala Prabhakar
గతంలో ఏపీ ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించిన పరకాల ప్రభాకర్ బహిరంగ వ్యాఖ్యలు చేయడం చాలా అరుదు. అయితే ఆయన సాక్షాత్తు తన అర్థాంగి, దేశ ఆర్థిక మంత్రి అయిన నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
 
ఇటీవలే కరోనా సంక్షోభం, ఆర్థిక పరిస్థితిపై దాని ప్రభావాలను నిర్మలా సీతారామన్ దైవ ఘటన (యాక్ట్ ఆఫ్ గాడ్)గా ప్రకటించారు. సూక్ష్మ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనే ఆలోచనలు కేంద్రం వద్ద లేదని దాన్నే వాళ్లు యాక్ట్ ఆఫ్ గాడ్ అంటున్నారు అని ప్రభాకర్ విమర్శించారు.
 
కరోనా వచ్చింది ఈ మధ్యనే గాని ఆర్థిక మందగమనం అంతకుముందు నుండే ఉందని తెలిపారు. 2019 అక్టోబరు లోనే ఆర్థిక పరిస్థితులపై స్పష్టం చేశాననీ, కానీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఆ తర్వాత వృద్ధి రేటు 23.9 శాతం తగ్గిందని వివరించారు. ఇకనైనా ఏదో ఒకటి చేసి దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాలన్నారు.
తర్వాతి కథనం
బూతుల మంత్రికి ఒళ్లు కొవ్వెక్కింది: కొడాలి నానిపై దేవినేని ఫైర్