శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 20 అక్టోబరు 2018 (10:03 IST)

తల్లితో అక్రమ సంబంధం వున్న వ్యక్తిని హతమార్చారు.. మర్మాంగాన్ని కోసి?

మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని ఆమె తనయులు హతమార్చారు. ఎంత చెప్పినా.. వివాహేతర సంబంధాన్ని విడువక.. తమ పరువుకు భంగం కలిగేలా వ్యవహరించిన వ్యక్తిని మట్టుబ

మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని ఆమె తనయులు హతమార్చారు. ఎంత చెప్పినా.. వివాహేతర సంబంధాన్ని విడువక.. తమ పరువుకు భంగం కలిగేలా వ్యవహరించిన వ్యక్తిని మట్టుబెట్టారు. ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, రహేమత్‌నగర్‌కు చెందిన ఓ వివాహిత అరబ్‌ దేశంలో ఉంటోంది. 
 
ఆమెకు మహ్మద్ సోహెల్ (23), మహ్మద్ సులేమాన్ (21) అనే కొడుకులున్నారు. తన భర్తకు అక్క కొడుకైన జావిద్ (33)తో ఆమెకు వివాహేతర సంబంధం ఉంది. విషయం తెలిసిన ఆమె భర్త, పిల్లలు మందలించినా ఆమె వినిపించుకోలేదు. దీంతో విసుగు చెందిన భర్త ఇంటి నుంచి వెళ్లిపోయి మరో మహిళతో సహజీవనం సాగిస్తున్నాడు. తల్లిదండ్రులు విడిపోవడం.. చెరో వ్యక్తులతో సహజీవనం చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కుమారులు జావిద్‌ను హత్య చేయాలని ప్లాన్ చేశారు. 
 
సవతి తల్లి కుమారుడైన మహ్మద్ ఈసా (21)లో కలిసి జావిద్ హత్యకు కుట్ర పన్నారు. అలా పక్కా ప్లాన్ ప్రకారం జావిద్‌ను మారణాయుధాలతో దాడిచేసి చంపేశారు. గొంతు, కడుపులో కత్తితో విచక్షణ రహితంగా పొడిచారు. అనంతరం అతడి మర్మాంగాన్ని కోసి దారుణంగా హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుపై దర్యాప్తును ముమ్మరం చేశారు.