శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : బుధవారం, 17 అక్టోబరు 2018 (14:46 IST)

అరవింద సమేతపై విమర్శలు.. చర్చా కార్యక్రమానికి వెళ్తూ.. రోడ్డు ప్రమాదం

జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేత సినిమా తెలుగు రాష్ట్రాలలో ఘన విజయం సాధించింది. అయితే ఈ సినిమాలో తమ భాషను, జీవితాలను అవమానించారని ఇటీవల హైదరాబాద్‌లో కొందరు యువకులు ప్రెస్‌మీట్ పెట్టి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ప్రెస్‌మీట్ తరువాత యువకులు ఓ ఛానల్‌లో జరిగిన డిబేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
ఇంకా బుధవారం మరో ఛానల్‌లో జరుగనున్న డిబేట్ కార్యక్రమంలో పాల్గొనాలని రాయల సీమ నుండి హైదరాబాద్‌కు బయలుదేరారు. కానీ వచ్చే దారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రమైన గాయాలతో వైద్యచికిత్సలు తీసుకుంటున్నట్లు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఆ యువకుల పేర్లు జలం శ్రీను, కృష్ణానాయక్, రవికుమార్, రాజశేఖర్ రెడ్డి.
 
ఈ ముగ్గురు అరవింద సమేత సినిమాలో మా భాషను, జీవితాన్ని కించపరిచారనే విషయంపై జరుగనున్న డిబేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వస్తున్నారని వీరి సన్నిహితుడు ఒకరు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఈ ప్రయాణం తుంగభద్రానది వరకు చేరుకుంది. దాంతో హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరి వాహనం ముక్కలైపోయింది. చివరికి జలం శ్రీను అక్కడే మృతి చెందాడు. మిగిలిన వారు తీవ్రంగా గాయపడ్డారని ఫేస్‌బుక్ పోస్ట్ కథనం. దీంతో పాటు వారి ఫోటోలను కూడా ఫేక్‌బుక్‌లో షేర్ చేశారు.