గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : బుధవారం, 17 అక్టోబరు 2018 (10:38 IST)

ప్రణయ్ హత్య కేసు.. ఆ ముగ్గురిపై మరో రెండు కేసులు

మిర్యాలగూడ ప్రణయ్ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పరువు కోసం ప్రణయ్‌ని హత్య చేయించిన అమృతవర్షిణి తండ్రి ప్రస్తుతం జైలులో వున్నాడు. ప్రణయ్ హత్య కేసు కారణంగా జైలులో ఉన్న అమృత తండ్రి మారుతీరావు, శ్రవణ్, కరీంలపై మరో రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు వారిని కోర్టును హాజరు పరిచారు.
 
ఈ కేసుల వివరాలకు వస్తే.. ప్రణయ్ బంధువులైన కోడిరెక్క అశోక్‌ను ఆగస్ట్ 6వ తేది, ఎర్రమళ్ల దినేష్‌ను ఆగస్ట్ 11వ తేది వారి కార్యాలయానికి పిలిపించి ప్రణయ్ కదలికలు మాకు తెలియజేయాలని, వారి సంబంధాలు వదిలేసుకోవాలని అమృత తండ్రి మారుతీరావు, శ్రవణ్, కరీంలు బెదిరించారు.
 
ఈ విషయంపై ప్రణయ్ బంధువులు తిరస్కరించడంతో వారిని హతమార్చుతామని బెదిరించారు. దాంతో అశోక్, ఎర్రమళ్ల దినేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ముగ్గురి నిందితులను కోర్టులోనికి ప్రవేశపెట్టారు. కేసును విచారించిన జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ నిందితులను అక్టోబర్ 29 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.