శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 24 సెప్టెంబరు 2018 (09:43 IST)

ప్రణయ్‌పై అలాంటి ప్రచారం తగదు..ఇక ఆపండి-అమృత

ప్రణయ్ ఒక రోమియో అని అతనికి ఇతర అమ్మాయిలతో సంబంధం వుందని వస్తున్న వార్తలను ఆమె సతీమణి అమృత ఖండించింది. ప్రణయ్ హత్య ఉదంతం ఇరు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నేపథ్యంలో.. ప్రణయ్ హత్యను కుల వివక్షతో ముడిప

ప్రణయ్ ఒక రోమియో అని అతనికి ఇతర అమ్మాయిలతో సంబంధం వుందని వస్తున్న వార్తలను ఆమె సతీమణి అమృత ఖండించింది. ప్రణయ్ హత్య ఉదంతం ఇరు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నేపథ్యంలో.. ప్రణయ్ హత్యను కుల వివక్షతో ముడిపెట్టి మాట్లాడుతుండగా, మరికొందరు ప్రణయ్ రోమియో అంటూ ప్రచారం చేస్తున్నారు. 
 
ప్రణయ్ గురించి సోషల్ మీడియాలో పలు వ్యతిరేక అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయి. ప్రణయ్ ఒక రోమియో అని... తొమ్మిదవ తరగతిలోనే అమృతను ప్రేమించిన ప్రణయ్‌కు వేరే అమ్మాయిలతో కూడా సంబంధాలు ఉన్నాయంటూ సరికొత్త చర్చకు తెరతీశారు. ఇదే అంశాన్ని ఓ మీడియా ఛానల్ అమృత వద్ద ప్రస్తావించింది. 
 
దీనికి సమాధానంగా అమృత మాట్లాడుతూ, ప్రణయ్ ఉన్నది తనతో, అతని తల్లిదండ్రులతో మాత్రమే అని తెలిపింది. తనకు తెలియని విషయాలు బయటివారికి ఎలా తెలుస్తాయని ప్రశ్నించింది. 
 
కాలేజ్ ఫ్రెండ్స్‌తో మాట్లాడటం సాధారణంగా జరిగేదేనని, తన ఫ్రెండ్స్‌తో తాను కూడా మాట్లాడతానని... ఇందులో తప్పేముందని అడిగింది. ఒక అమ్మాయితో మాట్లాడినంత మాత్రాన రోమియో అనడం సరికాదని చెప్పింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేసింది.