సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 20 సెప్టెంబరు 2018 (12:39 IST)

రాంగ్ కాల్‌ లింక్.. పెళ్లైనా ప్రేమ.. కానీ ప్రేయసిని చంపేశాడు.. ఎందుకు?

సోషల్ మీడియా ప్రభావంతో ప్రేమ అనేది ఎవరి మధ్య పుడుతుందో అర్థం కావట్లేదు. సోషల్ మీడియా ప్రభావంతో ప్రేమ ఎవరైనా పుట్టుకొస్తుంది. పెళ్లైన వారికి పెళ్లికాని వారిపై.. యువతీయువకులకు కూడా వయోబేధం లేకుండా ప్రేమ

సోషల్ మీడియా ప్రభావంతో ప్రేమ అనేది ఎవరి మధ్య పుడుతుందో అర్థం కావట్లేదు. సోషల్ మీడియా ప్రభావంతో ప్రేమ ఎవరైనా పుట్టుకొస్తుంది. పెళ్లైన వారికి పెళ్లికాని వారిపై.. యువతీయువకులకు కూడా వయోబేధం లేకుండా ప్రేమ చిగురిస్తుంది. దీంతో నేరాల సంఖ్య పెరిగిపోతూనే వుంది. తాజాగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ దంపతుల మధ్య రాంగ్‌కాల్ చిచ్చుపెట్టింది. 
 
పెళ్లి చేసుకున్నప్పటికీ పెళ్లికి తర్వాత మళ్లీ ప్రేమలో పడ్డారు. చివరికి ప్రియురాలి ఒత్తిడి మేరకు ఆ ప్రియుడు కట్టుకున్న భార్యనే ఆ కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాంగ్ ఫోన్ కాల్  ద్వారా ఏర్పడిన పరిచయం వీరిద్దరి మధ్య పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం వరకు వెళ్లింది. అయితే భార్య పిల్లలున్నా ప్రియుడు.. ప్రియురాలి ఒత్తిడి భరించలేక నమ్మించి ఆమెను హత్య చేశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకొంది. 
 
అనంతపురం జిల్లా కూడేరు మండలం శివరాంపేట గ్రామ సమీపంలో ఈ నెల మొదటివారంలో జరిగిన వివాహిత విజయలక్ష్మి హత్య కేసును పోలీసులు చేధించారు. ప్రియుడు రుద్రేష్ విజయలక్ష్మిని హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. కళ్యాణ దుర్గానికి చెందిన రుద్రేష్ అనే వ్యక్తి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ.. ఖాళీ సమయాల్లో విద్యార్థులకు ట్యూషన్లు చెప్పేవాడు. 2018 ఆగష్టు రెండో తేదీన రుద్రేష్‌కు చెందిన అనంతపురానికి చెందిన విజయలక్ష్మి అనే వివాహిత నుండి రాంగ్ కాల్ వచ్చింది. 
 
ఈ ఫోన్ కాల్ ద్వారా ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. విజయలక్ష్మికి భర్త వున్నా.. రుద్రేష్‌తో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగేది. చివరికి రుద్రేష్‌నే పెళ్లి చేసుకోవాలని విజయలక్ష్మి భావించింది. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా ప్రియుడిని కోరింది. మరోవైపు గంటల తరబడి విజయలక్ష్మితో ఫోన్లో మాట్లాడుతున్న రుద్రేష్‌ను ఆయన భార్య నిలదీసింది. ప్రియురాలు కూడ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో ఆమెను వదిలించుకోవాలని ప్లాన్ చేశాడు. 
 
విజయలక్ష్మి ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. సెప్టెంబర్ 5వ తేదీన విజయలక్ష్మిని రుద్రేష్ బయటకు తీసుకెళ్లాడు. ఇద్దరూ సరదాగా గడిపారు. కూడేరు మండలం శివరాంపేట సమీపంలోని గుట్టల్లోకి ఆమెను తీసుకెళ్లి.. మెడకు చున్నీ బిగించి హత్య చేశాడు. ఆమె నగలను కళ్యాణదుర్గంలోని ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టాడు. విజయలక్ష్మి ఫోన్‌లో ఉన్న రుద్రేష్ నెంబర్ ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేశారు. దీంతో రుద్రేష్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే అసలు విషయం వెలుగు చూసింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.