శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 20 సెప్టెంబరు 2018 (10:55 IST)

హీరో మోహన్ బాబుకు మాతృవియోగం

తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ నటుడుగా ఉన్న డాక్టర్ మంచు మోహన్ బాబు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. మోహన్‌బాబు తల్లి మంచు లక్ష్మమ్మ గురువారం కన్నుమూశారు. ఆమెకు వయసు 85 యేళ్లు.

తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ నటుడుగా ఉన్న డాక్టర్ మంచు మోహన్ బాబు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. మోహన్‌బాబు తల్లి మంచు లక్ష్మమ్మ గురువారం కన్నుమూశారు. ఆమెకు వయసు 85 యేళ్లు. 
 
తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్‌లో గురువారం ఉదయం ఆరు గంటలకు మంచు లక్ష్మమ్మ తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, ప్రస్తుతం విదేశాల్లో ఉన్న మోహన్‌బాబు, ఆయన కుటుంబ సభ్యులందరూ ఈ విషయం తెలియగానే స్వదేశానికి బయలుదేరారు. 
 
శుక్రవారం ఉదయం మంచు లక్ష్మమ్మ అంత్యక్రియలు తిరుపతిలో జరుగుతాయని మోహన్ బాబు కుటుంబ సభ్యులు తెలిపారు. లక్ష్మమ్మ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.