1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. International Tribal Day

గోండు, చెంచు, కోయ, అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం నేడు

International Tribal Day
అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం నేడు జ‌రుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్స‌వాన్ని నిర్వహిస్తున్నారు. ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ఈ దినోత్సవం నిర్వహించాలని 1994లో ఐక్యరాజ్య సమితి ప్రకటించింది.
 
1982, ఆగస్టు 9న జెనివాలో అటవీ వనరుల హక్కులకు సంబంధించిన సమస్యలపై 26 మంది స్వతంత్ర మానవ హక్కుల మేధావులతో వర్కింగ్‌ గ్రూప్‌ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 140 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆదివాసీల కోసం కూడా ఒక రోజు ఉండాలని ఐక్య రాజ్య సమితిని కమిటీ కోరగా, ఆదివాసుల సంరక్షణ చట్టాలకు ఐక్యరాజ్య సమితి ఆమోదం తెలిపింది.
 
ఈ కమిటీ 1992 నుండి పది సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్తంగా తిరిగి ఆదివాసీల సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి విశ్లేషించి 1994 నుండి 2014 వరకు ఆ మధ్య కాలాన్ని ఆదివాసీల అభివృద్ధి కాలంగా పరిగణించి ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవంగా ప్రకటించింది.
 
అంత‌ర్జాతీయ ఆదివాసీ దినోత్సవం నాడు ప్రపంచవ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజల్లో ఆదివాసీ హక్కుల గురించి అవగాహన కలిగిస్తారు. ఆదివాసులకు అండగా నిలబడిన వారిని సంర‌క్షించాల‌ని ప్ర‌తిన పూనుతారు.
తర్వాతి కథనం
వెంక‌టాచలంలో అక్ర‌మ త‌వ్వ‌కాలు! టిప్ప‌ర్లను అడ్డుకున్న గ్రామ‌స్తులు