ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 9 ఆగస్టు 2021 (09:35 IST)

సెప్టెంబరు 10నుంచి వరసిద్ధుడి బ్రహ్మోత్సవాలు

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను సెప్టెంబరు 10వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. సెప్టెంబరు 10న వినాయక చవితితో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై 30వ తేదీతో ముగుస్తాయి.

ఇందులో భాగంగా 10న వినాయక చవితి, 11న ఉదయం ధ్వజారోహణం, రాత్రి హంసం వాహన సేవ, 12న నెమలి వాహనం, 13న మూషిక వాహనం, 14న శేషవాహనం, 15న ఉదయం చిలుక వాహనం, రాత్రి వృషభ వాహనం, 16న గజ వాహనం, 17న రతోత్సవం, 18న ఉదయం బిక్షాండి, సాయంత్రం తిరుకల్యాణం, రాత్రి అశ్వవాహన సేవ, 19న ధ్వజ అవరోహణం, రాత్రి వడాయత్తు ఉత్సవం, స్వామికి ఏకాంత ఉత్సవంతో ఆలయంలో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా 20వ తేదీ సోమవారం అధికారనంది వాహనం, 21న రావనబ్రహ్మ వాహనం, 22న యాళీ వాహనం, 23న సూర్యప్రభ వాహనం, 24న చంద్రప్రభ వాహనం, 25న పుష్పపల్లకి సేవ, 26న కామధేను వాహనం, 27న కల్ప వృక్ష వాహనం, 28న విమానోత్సవం, 29న పూలంగి సేవ, 30వ తేదీ గురువారం తెప్పోత్సవంతో ఆలయంలో నిర్వహించే ప్రత్యేక ఉత్సవాలు ముగుస్తాయి.