సెప్టెంబరు 21న ఎడ్‌సెట్
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఎడ్‌సెట్-2021 (ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)కు నోటిఫికేషన్ విడుదల చేసినట్టు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కే.విశ్వేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు.
రెండేళ్ల రెగ్యులర్ కోర్సుకు ఆన్‌లైన్‌లో ఆగస్టు 17వ తేదీ వరకు (అపరాధ రుసుంతో ఆగస్టు 31 వరకు) దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
సెప్టెంబరు 21వ తేదీ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్రవ్యాప్తంగా ఎడ్‌సెట్ నిర్వహించనున్నామని తెలిపారు. మరిన్ని వివరాలకు www.sche.ap.gov.in/edcet ను సంప్రతించాలని విజ్ఞప్తి చేశారు.