బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: బుధవారం, 21 జులై 2021 (23:13 IST)

మాన్సాస్ ఉద్యోగుల‌పై పోలీస్ కంప్ల‌యింట్ చేస్తారా?

విజ‌య‌న‌గ‌ర రాజులు నెల‌కొల్పిన మాన్సాస్ ట్ర‌స్ట్ ఉద్యోగులపై ప్ర‌భుత్వం క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంద‌ని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మాన్సాస్ ఉద్యోగుల‌పై ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడాన్ని భారతీయ జనతా పార్టీ నేత డాక్టర్ కాశాపు వివివి సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు.
 
ఇటీవ‌ల రాజ‌కీయ వివాదంతో మాన్సాస్ ఉద్యోగులందరికీ గ‌త 8 నెలల నుంచి జీతాలు లేవు. దీనితో ఉద్య‌గులంతా మాన్సాస్ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ని కలిసి వారి ఆర్థిక సమస్యలు వివరించి వెంటనే జీతాలు ఇవ్వాలని అడిగారు. ఇది కూడా ప్రభుత్వానికి ఒక పెద్ద తప్పు కింద కనిపించడం చాలా విచారించదగిన అంశమ‌ని భారతీయ జనతా పార్టీ నేత డాక్టర్ కాశాపు వి వి వి సత్యనారాయణ ఆరోపించారు.
 
ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే, రాజకీయ కక్షల కారణంగానే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినట్లుగా భావించాల్సి వస్తుందని ఆయన అన్నారు. ప్రభుత్వం ఒక్క బటన్ నొక్కి వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల కింద ప్రజలకు పప్పుబెల్లాలు మాదిరిగా పంచుతోంద‌ని, కానీ కష్టపడి శ్రమ ఓర్చి పని చేసిన ఉద్యోగుల జీతాలు చెల్లించడానికి ఏమాత్రం కూడా ప్రభుత్వం ఇష్టపడకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగస్తులకు బాకీ ఉన్న ఎనిమిది నెల జీతాన్ని వెంటనే చెల్లించి వారి కుటుంబాలను ఆర్థికంగా నష్టపోకుండా ఆదుకోవాలని సత్యనారాయణ కోరారు.