జీతమడిగితే కేసులు పెడతారా?: అశోక్ గజపతిరాజు

ashok gajapati raju
జెఎస్కె| Last Modified బుధవారం, 21 జులై 2021 (22:10 IST)
సిబ్బంది జీతాల సమస్య ఇప్పటివరకు మాన్సాస్‌కి రాలేదని, జీతాల చెల్లింపుని అధికారులు సమస్యగా భావించటం సరికాదని మాన్సాస్‌ ట్రస్ట్
చైర్మన్‌ అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు.

బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సిబ్బంది లేకపోతే సంస్ధలకు మనుగడే ఉండదన్నారు. సిబ్బంది పనిచేసేది జీతాల కోసమేనని ఈవో ఇబ్బందులు కలిగించటం భావ్యం కాదని హితవుపలికారు. జీతమడిగితే కేసులు పెడతారా? అని ఆయన ప్రశ్నించారు.

సిబ్బందిని ఆయన ఏం చేయాలనుకుంటున్నారని నిలదీశారు. మాన్సాస్ చైర్మెన్‌గా తాను అడిగిన వాటికి సమాచారం ఇవ్వలేదని, జీతం రాకపోతే ఈవో పనిచేయగలరా? అశోక్ గజపతిరాజు ప్రశ్నించారు.
దీనిపై మరింత చదవండి :