శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: బుధవారం, 21 జులై 2021 (21:24 IST)

మంగ్లీపై కేసులు, వారిపై అభిమానుల ఆగ్రహం..?

సింగర్ మంగ్లీ పాటలంటే తెలంగాణాలో ఒక సంచలనమే. ఆమె పాట కోసం ఎదురుచూసే అభిమానులున్నారు. పండగల కన్నా ముందే ఆమె పాటలు ఆ సందడిని తీసుకొస్తాయి. అందుకే ఆమెకంత క్రేజ్. ప్రతి యేడాది బోనాల పండుగ సమయంలో ఒక సాంగ్ ను స్పెషల్ గా రిలీజ్ చేస్తోంది మంగ్లీ.
 
అదే బాటలో ఈ యేడాది రిలీజ్ చేసిన బోనాల సాంగ్స్ కూడా కాస్త స్పెషల్‌గా అభిమానులను షేక్ చేసింది. అయితే జూలై మొదటి వారంలో పాడిన పాటలో లిరిక్స్ వివాదాస్పదమైంది. 
 
అమ్మవారిపై తప్పుడు పదాలు ఉపయోగించారని మంగ్లీపై విమర్సలు వెల్లువెత్తాయి. దీంతో కొంతమంది హిందూ ధార్మిక సంఘాలు ఆమెపై  పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. దేవుళ్ళను కించపరిచే విధంగా మంగ్లీ పాటలు  పాడిందంటూ ఫిర్యాదు చేయడంతో ఆమెపై పోలీసు కేసు నమోదైంది.
 
శుక్రవారం ఆమె పోలీసులకు వివరణ ఇవ్వాల్సి ఉంది. అయితే మంగ్లీ అభిమానులు మాత్రం హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు కావాలనే ఫిర్యాదు చేశారని.. ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలంటున్నారు. తెలంగాణా యాస, బాషలో అద్భుతంగా పాటలు పాడే మంగ్లీని టార్గెట్ చేయడం సరికాదంటున్నారు అభిమానులు.