మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 20 జులై 2021 (10:40 IST)

దేశంలో 24 గంటల్లో కొత్తగా 30093 పాజిటివ్ కేసులు

దేశంలో కొత్తగా గత 24 గంటల్లో 30093 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక మీడియా బులిటెన్ రిలీజ్ చేసింది. 125 రోజుల తర్వాత కరోనా కేసులు 30వేలకు చేరాయి. 
 
మరోవైపు కొత్తగా 45,254 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వైరస్‌ బారినపడి 374 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,11,74,322కు పెరిగింది. ఇందులో 3,03,53,710 మంది డిశ్చార్జి అయ్యారు. 
 
ఇకపోతే, ఈ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇప్పటివరకు మొత్తం 4,14,482 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 4,06,130 యాక్టివ్‌ కేసులున్నాయి. అలాగే, దేశంలో 41,18,46,401 మందికి టీకాలు వేశారు.