గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 20 జులై 2021 (18:14 IST)

తెలంగాణ గ్రామాల్లో మళ్లీ లాక్డౌన్.. ఎందుకో తెలుసా?

తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లాలో మళ్లీ లాక్డౌన్ మొదలైంది. జిల్లాలోని వెల్గటూర్ మండలం ఎండపల్లిలో గత రెండు రోజుల క్రితం కరోనాతో ఒకరు మృతి చెందడంతో పాటు కరోనా కేసుల సంఖ్య 12కు పెరిగింది. దీంతో అప్రమత్తమైన గ్రామ పంచాయితీ మరోసారి లాక్ డౌన్ అమలుచేస్తునట్లు ప్రకటించింది.
 
నిజానికి ఈ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఆంక్షలను సడలించింది. దీంతో వ్యాపారాలు, మాల్స్, కాంప్లెక్స్‌లు తెరుచుకుంటున్నాయి. అయితే కొందరు మాత్రం ఇప్పటికీ ప్రజలు మాస్క్‌లు లేకుండా బయటికి రాకూడని అధికారులు చెప్తున్నారు. 
 
ఇక మళ్లీ థర్డ్ వేవ్ మొదలుకానుందని నిపుణులు హెచ్చరిస్తుంటడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరోసారి రాష్ట్రంలో లాక్డౌన్‌లు మొదలయ్యాయి. ఎండపల్లిలో గ్రామంలో జూలై 19వ తేదీ నుంచి ఆగస్ట్ 1 వరకు పది రోజుల పాటు లాక్డౌన్ విధిస్తూ గ్రామపంచాయతీ తీర్మానం చేసింది. 
 
ఉదయం ఏడు గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచాలని. ఆ తర్వాత మూసేయాలంటూ తీర్మానంలో పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన దుకాణ యజమానులకు 5 వేల రూపాయల జరిమాన విధిస్తామని తెలిపారు. 
 
అలాగే గుంపులుగా తిరిగినా, మాస్క్ ధరించకపోయినా వెయ్యి రూపాయల జరిమానా విధించాలని నిర్ణయించారు. ఏఎన్ఎంలకు కరోనా రోగుల సమాచారం అందించిన తర్వాతే.. ఆర్ఎంపీలు వైద్యం చేయాలని తీర్మానించారు. సామాజిక దూరం పాటించాలని.. గుంపులుగా తిరగొద్దని.. మాస్క్ ధరించాలంటూ అవగాహన కల్పించేలా గ్రామంలో వాల్ పోస్టర్స్ అతికించారు.