శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 21 జులై 2021 (10:32 IST)

24 గంటల్లో కొత్తగా 42015 పాజిటివ్ కేసులు

దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 42015 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిజానికి మంగళవారం నాటి హెల్త్ బులటెన్ మేరుక ఈ కేసులు 38 వేలుగా ఉన్నాయి. కానీ, బుధవారం వెల్లడించిన వివరాల మేరకు గత 24 గంటల్లో 42,015 క‌రోనా కేసులు న‌మోదయ్యాయి. అలాగే, 3,998 మంది మరణించారు. 
 
తాజాగా న‌మోదైన మ‌ర‌ణాల సంఖ్య కేవ‌లం 489 మాత్ర‌మే. 36,977 మంది క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దేశ వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 3,12,16,337 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, ప్ర‌స్తుతం 4,07,170 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 
 
మరోవైపు, ఈ మ‌హ‌మ్మారి నుంచి 3,03,90,687 మంది కోలుకోగా, మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 4,18,480కి చేరింది. ఇప్ప‌టివర‌కు 41,54,72,455 మంది క‌రోనా టీకా తీసుకున్నారు. వ‌రుస‌గా 30 రోజుల నుంచి పాజిటివిటీ రేటు 3 శాతంగా న‌మోదు కాగా, నిన్న 2.27 శాతంగా న‌మోదైంది.