గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 21 జులై 2021 (11:55 IST)

హర్యానాలో తొలి బర్డ్ ఫ్లూ మరణం - 11 యేళ్ళ బాలుడు మృతి

దేశంలో తొలి బర్డ్ ఫ్లూ మరణం నమోదైంది. హర్యానా రాష్ట్రానికి చెందిన 11 యేళ్ళ బాలుడు బర్డ్ ఫ్లూ వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయాడు. ఇది వైద్య వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ఇప్పటికే కరోనా వైరస్ దెబ్బకు వైద్య రంగం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇపుడు బర్డ్ ఫ్లూ వైరస్ సోకి ఓ బాలుడు చనిపోవడంతో మరింత ఆందోళన కలిగిస్తుంది.
 
దేశంలో తొలి బర్డ్ ఫ్లూ మరణం ఇదే కావడంతో ఆ బాలుడుకి చికిత్స అందిస్తూ వచ్చిన ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్యులు, సిబ్బంది ఐసోలేషన్‌లోకి వెళ్లారు. న్యూమోనియా, లుకేమియా లక్షణాలతో బాధపడుతున్న బాలుడు ఈ నెల 2న ఎయిమ్స్‌లో చేరాడు. అతడికి నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగటివ్‌గా తేలడంతో నమూనాలను పూణెలోని జాతీయ వైరాలజీ సంస్థకు పంపించారు. అక్కడి పరీక్షల్లో బాలుడికి సోకింది బర్డ్ ఫ్లూ అని గుర్తించారు.
 
సాధారణంగా బర్డ్‌ఫ్లూ అనేది నిజానికి కోళ్లు, పక్షుల్లో వస్తుంది. దీనిని హెచ్5ఎన్1 వైరల్ లేదంటే ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజాగా పిలుస్తారు. ఈ ఏడాది మొదట్లో మహారాష్ట్ర, గుజరాత్, చత్తీస్‌గఢ్, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాలు బర్డ్‌ఫ్లూతో వణికాయి. వేలాది పక్షులు నేలరాలాయి. ఒక్క పంజాబ్‌లోనే 50 వేలకు పైగా పక్షులు మృతి చెందాయి.