బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 20 జులై 2021 (19:58 IST)

పది లక్షల భోజనాలను అందించేందుకు సంగీతా మొబైల్స్‌తో చేతులు కలిపిన ఫీడింగ్‌ ఇండియా బై జొమాటో

జొమాటోకు చెందిన లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ ఫీడింగ్‌ ఇండియా ఇప్పుడు సుప్రసిద్ధ మల్టీ బ్రాండ్‌ మొబైల్‌ ఫోన్‌ రిటైలర్‌ సంగీతా మొబైల్స్‌‌తో భాగస్వామ్యం చేసుకుని పది లక్షలు (ఒక మిలియన్‌) భోజనాలను హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరులలో ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు సహా కోవిడ్‌ బాధిత కుటుంబాలకు అందించనుంది.
 
పోషకాలతో కూడిన ఆహారాన్ని లబ్ధిదారులకు అందించే కార్యక్రమాన్ని ఫీడింగ్‌ ఇండియా తమ 100కు పైగా పంపిణీ భాగస్వాముల సహకారంతో చేస్తుంది. అదే సమయంలో కోవిడ్‌-19 మార్గదర్శకాలైనటువంటి భౌతిక దూరం, కాంటాక్ట్‌లెస్‌ పంపిణీ సహా అన్ని మార్గదర్శకాలనూ అనుసరిస్తున్నామనే భరోసానూ అందిస్తుంది.
 
చైతన్య మాథుర్‌, హెడ్‌, ఫీడింగ్‌ ఇండియా బై జొమాటో మాట్లాడుతూ, ‘‘సంగీతా మొబైల్స్‌తో భాగస్వామ్యం చేసుకుని పది లక్షలకు పైగా భోజనాలను కోవిడ్‌-19 ప్రభావిత కుటుంబాలతో సహా ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు మా ‘డెయిలీ ఫీడింగ్‌ ప్రోగ్రామ్‌’లో భాగంగా అందించనున్నాం. ఈ కార్యక్రమం, క్రమంతప్పకుండా, పౌష్టికాహార భోజనాలను అవసరమైన ప్రజలకు అందించడంపై దృష్టి సారించింది. సంగీతా మొబైల్స్‌ అందించిన తోడ్పాటు ఇప్పుడు మరింత మందిని చేరుకోవడానికి, మరీ ముఖ్యంగా మహమ్మారి చేత తీవ్రంగా ప్రభావితమైన వారిని చేరుకోవడానికి సహాయపడనుంది’’ అని అన్నారు.
 
‘‘పరిస్థితులతో సంబంధం లేకుండా, మనమంతా ఒకరికొకరు తోడ్పాటునందించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ తరహా క్లిష్టపరిస్థితులలో, మన చుట్టుపక్కల వారికి రాయబారులుగానూ వ్యవహరించాల్సి ఉంది. ఈ విపత్కర పరిస్ధితులు త్వరలోనే ముగిసి పోవాలని ప్రార్థిస్తున్నాము. అదే సమయంలో, ఈ కష్టాలకు త్వరలోనే ముగింపు లభిస్తుందనే ఆశాభావంతోనూ ఉన్నాము. అప్పటివరకూ ఇళ్లలోనే సురక్షితంగా ఉండటంతో పాటుగా మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు ఈ కష్టాల నుంచి బయటపడేందుకు మీ వంతు తోడ్పాటునందించాల్సి ఉంది’’ అని శ్రీ సుభాష్‌ చంద్ర, మేనేజింగ్‌ డైరెక్టర్‌, సంగీతా మొబైల్స్‌ అన్నారు.