శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 10 మార్చి 2021 (18:17 IST)

ఆర్డర్ ఆలస్యం చేసారు, వద్దన్నందుకు మహిళపై జొమాటో బాయ్ పిడిగుద్దులు

ఆర్డర్ ఆలస్యం చేసారు, వద్దన్నందుకు మహిళపై జొమాటో బాయ్ పిడిగుద్దులు కురిపించాడు. రక్తమోడేట్లు ముక్కుపై బలంగా కొట్టాడు. ఆమె తనపై దాడి చేసిన విషయాన్ని ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. బెంగళూరుకు చెందిన బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్ హితేషా చంద్రానీ నెత్తురోడుతున్న ముఖంతో తనపై చేసిన దాడి గురించి వివరించి చెప్పారు.
 
తను మార్చి 9న మధ్యాహ్నం 3.30 గంటలకు ఆర్డర్ ఇవ్వగా అది సాయంత్రం 4.30 గంటలకు డెలివరీ చేయాల్సి ఉందన్నారు. కానీ దాన్ని సమయానికి తీసుకురాకుండా ఆలస్యం చేయడంతో తను కస్టమర్ కేర్‌కి ఫోన్ చేసి ఆర్డర్ క్యాన్సిల్ చేయాలని చెప్పానన్నారు.
 
తను చెపుతుండగానే డెలివరీ బోయ్ ఆర్డర్ తెచ్చి తీసుకోవాలని ఒత్తిడి చేశాడనీ, తనకు అవసరంలేదన్నందుకు ఇంట్లోకి చొరబడి తనపై దాడి చేశాడని చెప్పింది. ఆ తర్వాత ఆర్డర్ తీసుకున్నట్లు సంతకం చేయించుకుని అక్కడి నుంచి పారిపోయాడంటూ ఆరోపించారు. ఇలాంటి జొమాటో సురక్షితమేనా అంటూ ప్రశ్నించారు. తనకు న్యాయం జరగాలనీ, ఈ విషయంలో మద్దతుగా నిలవాలంటూ పిలుపునిచ్చారు.