గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 మార్చి 2021 (18:38 IST)

భార్యపై అనుమానం.. కుడి చేతిని, పాదాన్ని నరికేశాడు..

మహిళలపై అకృత్యాలు ఎక్కడపడితే జరుగుతూనే వున్నాయి. మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. భోపాల్‌లోని నిషత్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ అనుమానపు భర్త భార్యపై దారుణానికి తెగబడ్డాడు. భార్య అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఆమె కుడి చేతిని, పాదాన్ని నరికేశాడు. నిందితుడిని ప్రీతమ్ సింగ్ సిసోడియాగా పోలీసులు గుర్తించారు.
 
వివరాల్లోకి వెళితే.. భోపాల్‌లోని పరాస్ కాలనీలో ప్రీతమ్ సింగ్ సిసోడియా తన కుమారుడితో కలిసి నివసిస్తున్నాడు. అతని భార్య సంగీత ఇండోర్‌లోని ఓ ఫ్యాక్టరీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తోంది. సెలవు దినాల్లో ఆమె భోపాల్‌లోని భర్త ప్రీతమ్ వద్దకు వచ్చి వెళ్తుంటుంది. ఇదే క్రమంలో గత మంగళవారం ఆమె భర్త వద్దకు వచ్చింది.
 
ఆ రోజు మద్యం సేవించి ఇంటికి వచ్చిన ప్రీతమ్, భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. గొడ్డలితో ఆమె కుడి చేతిని, కుడి పాదాన్ని నరికేశాడు. సంగీత కేకలతో స్థానికులు ఆ ఇంటికి పరిగెత్తారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమె చేతిని, పాదాన్ని మళ్లీ అతికించడం సాధ్యం కాదని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.