శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 9 మార్చి 2021 (16:58 IST)

పెళ్ళి పేరుతో లోబరుచుకున్నాడు, అందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నా

తూర్పు గోదావరి జిల్లాలో వైసిపి సీనియర్ నాయకుడు చెల్లుబోయిన శ్రీనివాసరావు కుమారుడు ధనుష్ క్రిష్ణ మోసం చేశాడంటూ రేణుక అనే యువతి సెల్ఫీ వీడియోలో రోదిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జగన్ ప్రభుత్వంలో పనిచేస్తున్న మంత్రులు వల్ల తనకు అన్యాయం జరిగిందంటూ బోరున విలపిస్తూ వీడియోలను పోలీసులకు పంపించింది.
 
ప్రేమ, పెళ్ళి పేరుతో సూర్యనగర్‌కు చెందిన తనను ధనుష్ క్రిష్ణ శారీరకంగా వాడుకున్నాడని.. కానీ ఇప్పటివరకు పెళ్ళి చేసుకోలేదన్నారు. పోలీసులకు తాను ఫిర్యాదు చేశానని.. కానీ అతన్ని అరెస్టు చేయకుండా మంత్రి చెల్లబోయిన వేణుగోపాలక్రిష్ణ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 
 
తనకు న్యాయం జరగలేదని, అందుకే మున్సిపల్ ఎన్నికల్లో 15 వార్డులో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు రేణుక తెలిపారు. రాజకీయాల్లోకి తను రావడానికి ధనుష్ క్రిష్ణ అని.. తనను మోసం చేయడం వల్లనే తాను వార్డు మెంబర్‌గా పోటీ చేయాలనుకుని నిర్ణయం తీసుకున్నట్లు రేణుక సెల్ఫీ వీడియోలో తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.