కర్నాటక మంత్రితో ఆ యువతి ఏడాదిగా లింక్, ఇంతకీ ఆ యువతి ఎక్కడ?
సంచలనం సృష్టించిన కర్నాటక మంత్రి రమేష్ జార్కిహోలి రాసలీలల వీడియో వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ రాసలీలల వీడియో టేప్ వెనుక ఓ ఎమ్మెల్యే వున్నట్లు వార్తలు వస్తున్నాయి. జార్కిహోలితో అతడికున్న విరోధం కారణంగా పక్కా ప్లానుతో యువతిని ఎరగా వేసి మంత్రిని బాగా ఇరికించేశాడని చెప్పుకుంటున్నారు.
కాగా ఈ కేసులో విచారణ చేసేందుకు సదరు యువతి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటివరకూ ఆమె ఆచూకి వెలికి రాలేదు. ఆమె ఫోన్ నెంబర్ కూడా లభించలేదు. దీనితో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.
కర్నాటక మంత్రితో సదరు యువతి గత ఏడాదిగా లింకులో వున్నదనీ, బాగా నమ్మాక ఈ వీడియోను రహస్యంగా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఇదంతా ఓ ఎమ్మెల్యే పని అని మంత్రి అనుచరులు ఆరోపిస్తున్నారు.