శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 మార్చి 2021 (13:52 IST)

మంత్రి రాసలీలల సీడీని టీవీ ఛానెళ్లకు పంపి.. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు..

ఉద్యోగం ఇప్పిస్తానని మంత్రి ఒకరు తనను లైంగిక అవసరాలకు వాడుకున్నారని బెంగళూరులో ఓ మహిళ ఆరోపించారు. మంత్రి తనతో సన్నిహితంగా మెలిగిన దృశ్యాలను ఆమె రహస్యంగా చిత్రీకరించారు. దీని సంబంధిత సీడీని సహచట్టం కార్యకర్త దినేశ్‌ కల్లహళ్లికి చేరవేశారు. మంత్రిపై చర్యలు తీసుకోవాలని, తనకు, బాధిత మహిళకు రక్షణ కల్పించాలని కోరుతూ.. బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌ కమల్‌పంత్‌ను మంగళవారం సాయంత్రం దినేశ్‌ కోరారు.
 
కొన్ని టీవీ ఛానెళ్లకు సీడీలను పంపించిన దినేశ్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీనిపై సంబంధిత మంత్రి టీవీ ఛానెళ్ల ప్రతినిధులతో మాట్లాడుతూ.. తన చిత్రాలను ఉపయోగించి ఎవరో సీడీని రూపొందించారని ఆరోపించారు. 
 
సమగ్ర దర్యాప్తు చేస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. తాను కేసు ఎదుర్కోంటానని, వెనుకంజ వేయబోనని ప్రకటించారు. మరోవైపు మంత్రి నిజంగా తప్పు చేసినట్లు రుజువుతై తనపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి ప్రకటించారు. మంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేసి, విచారణకు సహకరించాలని డిమాండు చేస్తూ కాంగ్రెస్‌ కార్యకర్తలు మంగళవారం రాత్రి బెంగళూరులో ధర్నాకు దిగారు.