ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 4 మార్చి 2021 (12:14 IST)

ఇంటర్న్‌షిప్‌కు వస్తే మాయచేసి సూర్యలంక బీచ్‌కి తీసుకెళ్లాడు, ఆపై అత్యాచారం

అతడు పేరు మోసిన కంపెనీలో టీం లీడర్. చేసేది హైదరాబాద్ జూబ్లిహిల్స్ అమెజాన్ సంస్థలో. ఇక్కడికి ఇంటర్న్‌షిప్‌కు వచ్చిన ఓ యువతితో పరిచయం పెంచుకుని ఆపై ఆమెను ఎక్కడెక్కడో తిప్పాడు. గుంటూరు జిల్లా సూర్యలంక బీచ్ కి తీసుకెళ్లాడు. నేరుగా ఇంటికి వస్తూ పోతూ వున్నాడు. చివరికి ఆమెపై అత్యాచారం చేసి తప్పించుకు తిరుగుతున్నాడు. చివరికి పోలీసులకు చిక్కాడు.
 
పూర్తి వివరాలను చూస్తే... యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన 26 ఏళ్ల సాయిగణేష్ సికింద్రాబాదులో నివాసముంటూ అమెజాన్ సంస్థలో టీం లీడరుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో పంజాబ్ రాష్ట్రానికి చెందిన 22 ఏళ్ల విద్యార్థిని కంపెనీలో ఇంటర్న్‌షిప్‌ కోసం వచ్చింది. ఆమె యూసఫ్ గూడలో నివాసం వుంటోంది. ఇంటర్న్‌షిప్‌ చేస్తున్న ఆమెతో మాటలు కలిపాడు. నేరుగా ఆమె ఇంటికే వెళ్లేవాడు.
 
 మంచిగా వున్నాడులే అని వారు కూడా స్వేచ్ఛనిచ్చారు. అదే అదనుగా ఆ యువతిని నగరంలోని పలుచోట్లకు తిప్పాడు. ఆ తర్వాత గుంటూరు జిల్లా సూర్యలంక బీచ్‌కి తీసుకెళ్లాడు. ఓ పర్యాటక ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ హోటల్ గదిలో ఆమెపై అత్యాచారం చేసాడు. దీంతో బాధితురాలు జూబ్లిహిల్స్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పక్కగా స్కెచ్ వేసి అదుపులోకి తీసుకున్నారు. కోర్టు అతడికి రిమాండ్ విధించింది.