అది దక్కేదాకా నిద్రపోను: సెక్స్ కుంభకోణంలో ఇరుక్కున్న మంత్రి రాజీనామా
కర్నాటక జల వనరుల శాఖ మంత్రి రమేష్ జరాకిహోలి తన పదవికి రాజీనామా చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
“నేను పార్టీని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. దర్యాప్తు తర్వాత నేను నిర్దోషిగా తిరిగి వస్తాను, మరోసారి మంత్రి అవుతాను” అని ఆయన ముఖ్యమంత్రి బి ఎస్ యడియూరప్పకు తెలిపారు.
అంతకుముందు రోజు, రాష్ట్ర హోంమంత్రి బసవరాజ్ బొమ్మాయి మాట్లాడుతూ, మంత్రి సెక్స్ కుంభకోణం ఆరోపణలపై విచారణకు ఆదేశించారు. కేబినెట్‌కు రాజీనామా చేయాలని బిజెపి హైకమాండ్ డిమాండ్ చేస్తోందని ఆయన చెప్పారు.
కాగా మంత్రి ఓ మహిళతో కలిసి వున్న లైంగిక అసభ్యకరమైన వీడియో టేప్ మంగళవారం మీడియాలో వైరల్ అయ్యింది. సామాజిక కార్యకర్త దినేష్ కల్లాహల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మంత్రితో శృంగారంలో పాల్గొన్న మహిళతో పాటు తనకు మరణ ముప్పు ఉందని పేర్కొన్నాడు. కాగా ఆ వీడియోలో మహిళతో మంత్రి... సీఎం పదవి దక్కేవరకూ తను నిద్రపోను అంటూ వ్యాఖ్యానించినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.