గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Modified: మంగళవారం, 2 మార్చి 2021 (18:36 IST)

తెలంగాణా కోడలు షర్మిలా రెడ్డి సత్తా చాటుతుందా?

నేను తెలంగాణా కోడలిని, పుట్టిపెరిగింది హైదరాబాద్‌లో. తెలంగాణా యాస నా భాష. నేను స్థానికురాలిని కాదని చాలామంది అంటున్నారు. దీన్ని నేను ఒప్పుకోను అంటూ అనతికాలంలోనే రాజకీయాల్లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుని ముందుకు సాగుతోంది షర్మిళ. 
 
తండ్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కలలు గన్న రాజన్న రాజ్యం కావాలంటే ఖచ్చితంగా తెలంగాణా రాష్ట్రంలో పార్టీ పెట్టాలని ఆమె నిర్ణయం తీసుకున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే ఎప్పుడు షర్మిళ పార్టీ పెడుతుంది.. పార్టీ పేరేమిటి అన్న ఆతృత అందరిలోను కనబడుతోంది.
 
ఇప్పటికే పలువురితో సమావేశమవుతున్నారు షర్మిళ. ముఖ్యంగా విద్యార్థులు, వివిధ కులాలకు చెందిన వ్యక్తులతో సమావేశమవుతూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. అందరి సమస్యలు తెలుసుకున్న తరువాత ఒక ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకుని పార్టీ పెట్టాలన్నది షర్మిళ ఆలోచన.
 
అందుకే సొంత అన్న వద్దన్నా ఆమె పార్టీ పెడుతున్నారు. అన్నతో విభేదించి మరీ రాజకీయాల్లో ముందుకు సాగుతున్నారు. అయితే షర్మిళ ఏప్రిల్ 9వ తేదీన పార్టీ పేరును, విధివిధానాలను ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసేసుకున్నారట. 
 
అంతేకాదు కొంతమంది రాజకీయ సలహాదారులతో సంప్రదింపులు జరిపి పార్టీ పేరును కూడా నిర్ణయించేసుకున్నారట. అయితే తెలంగాణా కోడలు తెలంగాణా రాష్ట్రంలో ఎలా రాణిస్తుందో.. అసలు ప్రజలు ఆమె పార్టీని, ఆ పార్టీలోని నాయకులను నమ్ముతారా లేదా అన్న ఆసక్తిగా మారుతోంది.