సంబంధిత వార్తలు
- కరోనా వైరస్ రహిత రాష్ట్రంగా అరుణాచల్ ప్రదేశ్
- నాలుగు రకాల వ్యాక్సిన్లు.. ఏది కావాలో ప్రజలే నిర్ణయించుకోవచ్చు : రణదీప్ గులేరియా
- సంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం.. 12మంది బాలికలకు పాజిటివ్
- కొత్త చట్టంతో స్ఫూర్తి.. గూగుల్ యాడ్ రెవెన్యూలో 85 శాతం ఇవ్వాలి..
- క్యాప్ జెమినిలో భారీగా ఉద్యోగాలు.. 30వేల మంది ఐటీ ఉద్యోగులను..?
దేశంలో ఒక్కసారిగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు
కరోనా వైరస్ మరోమారు దేశ ప్రజలను భయపెడుతోంది. గత కొన్న రోజులుగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్యే ఇందుకు నిదర్శనం. దేశంలో కొత్తగా నమోదైన కరోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసింది.
ఈ గణాంకాల మేరకు దేశంలో గత 24 గంటల్లో 15,510 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదేసమయంలో 11,288 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,12,241కు చేరింది.
గడచిన 24 గంటల సమయంలో 106 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,57,157 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,07,86,457 మంది కోలుకున్నారు. 1,68,627 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 1,43,01,266 మందికి వ్యాక్సిన్ వేశారు.
కాగా, దేశంలో ఆదివారం వరకు మొత్తం 21,68,58,774 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 6,27,668 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
మరోవైపు, తెలంగాణలో కొత్తగా 116 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్రకారం... గత 24 గంటల్లో కరోనా మరణాలు సంభవించలేదు. అదే సమయంలో 165 మంది కోలుకున్నారు.
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,98,923 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,95,387 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,634 గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,902 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 804 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు.
