గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 1 మార్చి 2021 (09:46 IST)

తెలంగాణ... వ్యక్తిని పొట్టన బెట్టుకున్న మొసలి

తెలంగాణలో దారుణం చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ఇసోజి పేటలో ఒక వ్యక్తిని మొసలి పొట్టన పెట్టుకుంది. పశువుల కాపరిగా పని చేస్తున్న రాములు అనే వ్యక్తి మీద మొసలి దాడి చేయడం సంచలనంగా మారింది. రాములుని నీళ్ళలోకి ఈడ్చుకు వెళ్ళిన మొసలి అతనిని చంపేసింది. పశువులు నీరు తాగించేందుకు వెళ్లిన రాములు మొసలికి బలైనట్టు చెబుతున్నారు.
 
అతని మీద మొసలి దాడి చేసినప్పుడు ఒడ్డు మీద ఉన్న ఇతర పశువుల కాపరులు తమ వద్ద ఉన్న కర్రలతో ఒడ్డు మీద నుంచే నీళ్లపై గట్టిగా కొడుతూ అరుపులు, కేకలు వేశారు. అయినా రాములుని మాత్రం మొసలి విడిచిపెట్టలేదని అంటున్నారు. అయితే కొద్దిసేపటి తర్వాత నీళ్లలో వెతగ్గా రాములు మృతదేహం లభించింది. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ఇసోజిపేట-కోడూరు గ్రామ శివారులోని మంజీరా నదిలో నిన్న ఈ ఘటన జరిగింది.