సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (22:19 IST)

అమెరికాలో 23 నిమిషాల్లో తెలంగాణ వ్యక్తి సూర్య నమస్కారం..

అమెరికాలోని మ్యాడిసన్ నగరంలో తెలంగాణలోని జగిత్యాలకు చెందిన యువకుడు ప్రవీణ్ చేసిన సూర్య నమస్కారాలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అయింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. అతడిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా, మెట్‌పల్లి మండలం వెళ్లుల్లకు చెందిన ప్రవీణ్ అమెరికాలోని మ్యాడిసన్ నగరంలో ఘనీభవించిన సరస్సుపై.. 23 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు చేసి ఆశ్చర్యపర్చాడు. 
 
కాగా.. ప్రవీణ్ నాలుగేళ్లలో 11 పర్వాతాలను అధిరోహించి ఔరా అనిపించారు. మణిమహేశ్ కైలాష్, ఎవరెస్ట్, మేరా పర్వతం సహా ఫాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియాలోని పలు పర్వతాలను అధిరోహించారు. యూఎస్‌లోని మౌంట్ సోమా శిఖరాన్ని అధిరోహించి ఆయన.. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు.