తాను తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ పెట్టడం తన సోదరుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం ఇష్టం లేదని వైఎస్. షర్మిల అన్నారు. పైగా, తాను ఎవరో వదిలిన బాణాన్ని కాదన్నారు. తన స్థానికతపై వస్తున్న విమర్శలను ఆమె తిప్పికొట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్, బీజేపీ నాయకురాలు విజయశాంతి ఎక్కడ పుట్టారని సూటిగా ప్రశ్నించారు. ఒకరు ఉద్యమం, మరొకరు మతం అంటూ రాజకీయాలు చేయడం తప్ప.. ప్రజల...