శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (19:57 IST)

తెలంగాణలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 42,432 నమూనాలను పరీక్షించగా.. 189 మందికి కరోనా సోకినట్లు తేలింది. కరోనా బారినపడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
 
తాజాగా, నమోదైన 189 కేసులతో రాష్ట్రంలో ఒప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,98,453కి చేరింది. గత 24 గంటల్లో ఇద్దరు మరణించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో సంభవించిన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1632కు చేరింది.
 
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 129 మంది పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 2,94,911కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1910 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో 818 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.