సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 23 జూన్ 2020 (17:07 IST)

కర్నాటక మంత్రికి కరోనా నెగెటివ్... భార్య - కమార్తెకు పాజిటివ్..

కర్నాటక మంత్రి కె. సుధాకర్ కరోనా వైరస్ బారినపడుకుండా తప్పించుకున్నారు. కానీ, ఆయన భార్య, కుమార్తెకు మాత్రం ఈ వైరస్ సోకింది. ఈ విషయాన్ని స్వయంగా మంత్రే ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. 
 
మంత్రి సుధాకర్ తండ్రి పీఎన్ కేశవ రెడ్డికి (82) ఇప్పటికే కరోనా సోకింది. సోమవారం ఆయనకు కరోనా పాజిటివ్‌గా తెలిసింది. దీంతో మంత్రి సుధాకర్‌కు కూడా కరోనా పాజిటివ్ వచ్చివుంటుందని భావించి, కరోనా టెస్టులు నిర్వహించారు. 
 
కానీ, తనకు నెగెటివ్ వచ్చిందనీ, తన కుటుంబ సభ్యుల్లో భార్య, కుమార్తెకు మాత్రం పాజిటివ్ వచ్చిందని తెలిపారు. వారికి చికిత్స జరుగుతోందని తెలిపారు. తనకు, తన ఇద్దరు కుమారులకు కరోనా నెగిటివ్‌ వచ్చిందని మంత్రి సుధాకర్ తెలిపారు.
 
కాగా, ఒక్కరోజు వ్యవధిలో మంగళవారం మంత్రి భార్య, కుమార్తె కరోనా బారినపడినట్లు వెల్లడైంది. గత ఏప్రిల్‌లో మంత్రి, ఆయనతో పాటు మరో ముగ్గురు మంత్రులు నిర్వహించిన ఓ సమావేశానికి హాజరైన ఓ జర్నలిస్ట్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో.. మంత్రి క్వారంటైన్‌లో కూడా ఉన్నారు.