శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 10 ఆగస్టు 2020 (15:07 IST)

మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇక రుతు సెలవులు తీసుకోవచ్చు..

దేశీయ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో తమ సంస్థలోని మహిళా ఉద్యోగులకు పెద్ద బహుమతి ఇచ్చింది. మహిళలకు రుతు సెలవులు ఇవ్వబోతోంది. కంపెనీలో పనిచేసే మహిళలతో పాటు, ట్రాన్స్‌జెండర్లకు కూడా ప్రయోజనం లభిస్తుంది. భారతదేశంతో పాటు, ఇతర దేశాలలో కూడా ఈ సంస్థ తన సేవలను అందిస్తుంది. జొమాటోలో ఐదువేల మందికి పైగా పనిచేస్తున్నారు.
 
భారత్‌లో రుతుస్రావం గురించి అవగాహన లేకపోవడం వల్ల భారతదేశంలో లక్షలాది మంది మహిళలు బాలికలు ఇప్పటికీ వివక్ష, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అటువంటి పరిస్థితిలో, జొమాటో నిర్ణయాన్ని, నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇక జొమాటో ఈ కొత్త రూల్ పీరియడ్ పాలసీని ఇప్పటికే అమల్లోకి తెచ్చింది. సంస్థలో పనిచేసే సంస్కృతిని ప్రోత్సహించడమే తమ లక్ష్యమని కంపెనీ తెలిపింది. 
 
పీరియడ్ లీవ్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఎలాంటి మొహమాటం ఉండకూడదని జోమాటో సీఈఓ దీపెందర్ గోయల్ తన మహిళా ఉద్యోగులందరికీ ఇ-మెయిల్ ద్వారా చెప్పారు. ఈ సెలవు తీసుకోవడానికి పూర్తిగా ఉచితమని తెలిపారు. పీరియడ్ లీవ్ కోసం, మీ సహోద్యోగులకు ఇమెయిల్, ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడం, ద్వారా తెలియజేసి సెలవు తీసుకోవాలని తెలిపారు.