మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 ఆగస్టు 2020 (13:10 IST)

బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్.. రూ.147కి రీఛార్జ్ చేస్తే?

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) సరికొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రూ.147 ధరతో కొత్త ప్లాన్ అందిస్తోంది. రూ.147 ప్లాన్ రీఛార్జ్ చేసిన వారికి 250 నిమిషాల వరకు లోకల్, ఎస్‌టీడీ వాయిస్ కాల్స్ లభిస్తాయి. ఈ ప్లాన్‌తో 10జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. వేలిడిటీ 30 రోజులు మాత్రమే. బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్ కూడా లభిస్తాయి. 
 
కస్టమర్లు ఓ ఎస్ఎంఎస్ పంపి ఇండిపెండెన్స్ డే స్పెషల్ రూ.147 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు. దీంతో పాటు రూ.247 ప్లాన్‌కు 6 రోజులు, రూ.1,999 ప్రీపెయిడ్ ప్లాన్‌పై 74 రోజులు వేలిడిటీని పొడిగించింది బీఎస్ఎన్ఎల్. 
 
అలాగే రూ.247 ప్లాన్‌పై 36 రోజులు, రూ.1,999 ప్లాన్‌పై 439 రోజుల వేలిడిటీ పొందొచ్చు. ఈ ప్లాన్స్‌పై ఎరాస్ నౌ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. 30 రోజుల వరకు ఎరాస్ నౌ కంటెంట్ ఉచితంగా చూడొచ్చు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా బీఎస్ఎన్ఎల్ అందించే ఈ ప్రమోషనల్ ఆఫర్స్ అన్నీ ఆగస్ట్ 31 వరకేనని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.