ఆంధ్రలో ఉరుములు, మెరుపులు

thunderstorm
జెఎస్కె| Last Updated: బుధవారం, 21 జులై 2021 (21:53 IST)
రానున్న 48 గంటల పాటు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అనేక చోట్ల వర్షం కురిసే అవకాశం ఉండటంతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని అధికారులు చెప్పారు.

రాష్ట్రంలోని తీరప్రాంత జిల్లాలలో గంటకు 20 నుండి 30 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా
40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది అని వాతావరణ కేంద్రం డైరెక్టర్ ఎస్. స్టెల్లా పేర్కొన్నారు.

ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల
కురిసే అవకాశం ఉంది అని వివరించారుదీనిపై మరింత చదవండి :