ఆంధ్రాలో రాత్రి కర్ఫ్యూ పొడగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూను పొడగించారు. కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. పాజిటివ్ కేసులు రోజురోజుకూ గణనీయంగా తగ్గుతున్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించకూడదని ప్రభుత్వం మరో వారం పాటు నైట్ కర్ఫ్యూను పొడిగించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి.
మరోవైపు, కోవిడ్ నివారణ, వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. సమర్ధ నిర్వహణ ద్వారా ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ ఇవ్వగలిగామని సీఎం అన్నారు. థర్డ్‌వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.