శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 4 ఆగస్టు 2021 (08:00 IST)

ఏపీలో సెప్టెంబరు 15 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు సెప్టెంబరు 15 నుంచి 23 వరకు జరగనున్నాయి. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సంవత్సరం విద్యార్థలకు పరీక్షలను నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు తెలిపింది.

ప్రాక్టికల్స్‌ పరీక్షలు అక్టోబరు 4 నుంచి 7వరకు జరగనున్నాయి. ఇంటర్‌ పస్టియర్‌, సెకండియర్‌ విద్యార్థులు ఈ నెల 17లోపు పరీక్ష ఫీజు చెల్లించాలి. మార్చిలో ఫీజు చెల్లించిన విద్యార్థులు మళ్లీ ఇప్పుడు కట్టనక్కర్లేదు.

25న పద్మావతి వర్సిటీ 18వ స్నాతకోత్సవం
తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ 18వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్నారు. 2016 నుంచి 2019 వరకూ వివిధ కోర్సులు పూర్తి చేసిన వారికి  స్నాతకోత్సవ డిగ్రీలను ప్రదానం చేయనున్నారు. ఈ స్నాతకోత్సవానికి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పద్మావతి వర్సిటీ ఛాన్స్‌లర్‌ హోదాలో హాజరు కానున్నారు.