1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: సోమవారం, 2 ఆగస్టు 2021 (20:21 IST)

స్పందన ఫిర్యాదులకు ప్రాముఖ్యత ఇవ్వండి: తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ అప్పల నాయుడు

తిరుపతి అర్బన్ జిల్లా పోలీసు కార్యాలయంలో స్పందన కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా యస్.పి శ్రీ వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్ గారు ఈ రోజు ఉదయం 10.30 నుండి స్పందన ఫిర్యాదుల స్వీకరన కార్యక్రమ్మాన్ని నిర్వహించినారు.
 
ఈ కార్యక్రమం ద్వారా జిల్లా యస్.పి కార్యాలయానికి “47” ఫిర్యాదులు అందినాయి. తిరుపతి అర్బన్ జిల్లా పరిదిలోని ప్రజలు నేరుగా వచ్చి కలిసి తమ యొక్క సమస్యల తెలియపరిచి వినతులను ఇచ్చినారు.

వారి యొక్క సమస్యలకు సానుకూలంగా స్పందించి ప్రతి ఒక్కరిని కేసు విషయాలు అడిగి తెలుసుకొని సంబందిత పోలీస్ స్టేషన్ల పరిదిలోని అధికారులకు తక్షణమే ఫోన్ కాల్ ద్వార సమాచారం అందించి ప్రజల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నారు. స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకార విచారణ జరిపి, నిర్దేశించిన గడువు లోగా ఫిర్యాదు దారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం జరుగుతుంది.
 
ఫిర్యాదులు:-
సార్ నా పేరు నీరజ (పేరు మార్చబడింది.) నేను శ్రీకాళహస్తి పట్టణంలో నివాసం ఉంటున్నాను. నా ఫోన్ కు గత కొంత కాలంగా  గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ నుండి అసభ్యకరంగా మెసేజులు వస్తున్నాయి. తదుపరి నేను నా యొక్క ఫోన్ నెంబర్ మార్చినాను. కానీ ప్రస్తుత నెంబర్ కు కూడా అదేవిధంగా అసభ్యకరమైన మెసేజులు నా పేరు మీదే వస్తున్నాయి. దీని వలన నేను మానసికంగా చాలా క్షోభను అనుభవిస్తున్నాను. నాకు న్యాయం చేయవలసినది నా అభ్యర్తిస్తున్నానని యస్.పి గారికి స్పందన ఫిర్యాదుల ద్వారా విన్నవించుకున్నారు.
 
ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన జిల్లా యస్.పి గారు వారు కార్యాలయంలో ఉండగానే సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ వారికి సమాచారం తెలిపి వెంటనే కేసు గురించి విచారణ చేయవలసినదిగా ఆదేశించారు. తదుపరి అసభ్యకరంగా మెసేజులు పెట్టిన వ్యక్తి యొక్క లొకేషన్ తెలుసుకొని కేసు నమోదుచేసి దర్యాప్తు చేయాలని సూచించారు.

మెసేజులు పెట్టిన వ్యక్తి యొక్క కొన్ని ఆనవాలను ఫిర్యాదు మహిళకు చూపించి సంబంధపడిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారో అని గుర్తించమని తెలిపారు. సదరు మహిళ తెలిపిన ఆధారాల మేరకు సైబర్ క్రైమ్ పోలీస్ వారు దర్యాప్తును ప్రారంభించారు. తక్షణమే స్పందించిన తీరుకు ఫిర్యాదు దారులు ఆనందాన్ని వ్యక్తపరిచి జిల్లా యస్.పి వారికి కృతజ్ఞతలు తెలిపారు.