బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 20 జులై 2021 (20:53 IST)

తిరుపతిలో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టురట్టు

పట్టణంలోని ఎస్‌బీఐ కాలనీలో రహస్యంగా కొనసాగతున్న హైటెక్ వ్యభిచార ముఠా గుట్టును ఈస్ట్ పోలీసులు రట్టు చేశారు.  వాట్సప్ ద్వారా యువతుల ఫొటోలను విటులకు నిర్వాహకులు పంపారు.

నిర్వాహకులను బళ్లారికి చెందిన స్వప్న, లక్ష్మి ప్రియగా గుర్తించినట్లు సీఐ శివప్రసాద్ రెడ్డి తెలిపారు. బెంగుళూరు, గుడివాడ నుంచి యువతులను రప్పించి, జీవకోన శ్రీనగర్ కాలనీకి చెందిన సాయి చరణ్ ద్వారా లక్ష్మిప్రియ, స్వప్నలు వ్యభిచారం నిర్వహిస్తుండగా దాడి చేసి పట్టుకున్నామని సీఐ తెలిపారు.

పలువురు యువతులను రక్షించినట్లు ఆయన పేర్కొన్నారు. దీనితో సంబంధమున్న నలుగురిపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. ఇద్దరు నిర్వాహకులను అరెస్ట్ చేసినట్లు సీఐ శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.