శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Modified: మంగళవారం, 6 జులై 2021 (21:02 IST)

ఇంట్లో ఒంటరిగా బాలిక, నలుగురు యువకులు గ్యాంగ్ రేప్

వాంతులు, కడుపునొప్పితో బాధపడుతున్న 14 ఏళ్ల కూతురిని నిలదీసిన తల్లి.. ఆమె చెప్పిన వార్త విని షాకైంది. వెంటనే కూతురిని తీసుకుని పోలీస్ స్టేషన్‌కు బయల్దేరింది. తన కూతురిపై కొద్ది రోజులుగా అత్యాచారానికి పాల్పడుతున్న నలుగురు యువకులపై పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. హర్యానాలోని ఛక్రిదాద్రి జిల్లాలోని జోజు కలన్ గ్రామంలో జరిగింది. 
 
జోజు కలన్ గ్రామానికి చెందిన మహిళ కూలి పనుల కోసం రోజూ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతుంది. ఆమె 14 ఏళ్ల కూతురు మాత్రమే ఇంట్లో ఉంటుంది. ఇది గమనించిన అదే ఊరికి చెందిన ఓ యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే కుటుంబం మొత్తాన్ని చంపేస్తానని బెదిరించాడు. తర్వాతి రోజు తన స్నేహితుడితో కలిసి మళ్లీ ఆ బాలిక దగ్గరకు వెళ్లాడు. ఆ ఇద్దరూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న మరో ఇద్దరు యువకులు కూడా ఆమెను బెదిరించి అత్యాచారానికి ఒడిగట్టారు. 
 
ఇలా బెదిరిస్తూ ఆమెపై నలుగురూ పలుమార్లు అత్యాచారం చేశారు. గత సోమవారం ఆ బాలికకు కడుపునొప్పి, వాంతులు వంటి సమస్యలు తలెత్తాయి. తల్లి నిలదీయడంతో ఆ బాలిక అప్పటివరకు జరిగిన విషయం మొత్తాన్నీ చెప్పేసింది. దీంతో తల్లి సమీప పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆ నలుగురు యువకులపై కేసు నమోదు చేసింది. బాలిక స్టేట్‌మెంట్ తీసుకున్న పోలీసులు పోస్కో చట్టం కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.