ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శనివారం, 3 జులై 2021 (17:14 IST)

లబ్దిదారులు త్వరితగతిన ఇల్లు నిర్మించుకొని గృహప్రవేశాలు చేయాలి

గుడివాడ : రాష్ట్ర ప్రభుత్వం  నవరత్నాలు - పేదలందరికీ ఇల్లు కార్యాక్రమంలో భాగంగా మెగా గ్రౌండింగ్ మేళా లబ్దిదారులందరూ సద్వినియోగం చేసుకొని ఇళ్లనిర్మాణం చేసుకోవాలని గుడివాడ డివిజన్ ఇళ్ల నిర్మాణ పర్యవేక్షణాధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ (ఆసరా) కె. మోహన్ కుమార్ అన్నారు.
 
శనివారం, స్థానిక గుడివాడ మున్సిపాలిటీ పరిధిలో గల మల్లాయపాలెం లేఅవుట్ ను  జేసీ మోహన్ కుమార్ మున్సిపల్ కమీషనర్ సంపత్ కుమార్ తో కలిసి పరిశీలించి పలువురు లబ్దిదారుల ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గుడివాడ డివిజన్ పరిధిలో మొదటి దశలో గృహనిర్మాణాలు మంజూరు అయిన లబ్దిదారులందరూ వేగవంతగా ఇల్లు నిర్మించుకోవాలని కోరారు.

ఈ రోజు,రేపు నిర్వహించే మేగా గ్రౌండింగ్ మేళాలో లబ్దిదారులందరూ ఇల్లు శంకుస్తాపన చేసుకోవాలన్నారు. గుడివాడ డివిజన్లో మొత్తం 32292 మంది లబ్దిదారులుకు ఇళ్ల  స్థల పట్టాలు అందించగా మొదటి దశలో 30184 మంది ఇళ్లు నిర్మించనునన్నట్లు చెప్పారు. గుడివాడ  నియోజకవర్గంలో 5404, కైకలూరు నియోజకవర్గంలో 3361, పామర్రు నియోజకవర్గంలో 7293 మొత్తం గుడివాడ డివిజన్ పరిధిలో 16058 ఇళ్లకు లబ్దిదారులు భూమి పూజతో పాటు   శంకుస్థాపనలు చేస్తారన్నారు.

మూడు రోజుల పాటు నిర్వహించే మేగా గ్రౌండింగ్ మేళాలో 16058 ఇళ్లకు లబ్దిదారుల చేత భూమి పూజతో పాటు శంకుస్థాపనలు చేయిస్తున్నామన్నారు. ఒక్కో గృహం నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.1లక్షా 80 వేలు ఇస్తుందని, కాలనీలో సీసీ రోడ్లు, ఇంటింటికి మంచినీళ్లు, భూగర్భ డ్రైనేజ్,భూగర్భ విద్యుత్ వంటి అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు.

గుడివాడ మన్సిపాలటీలో మల్లాయపాలెంలో ఇంత పెద్దఎత్తున లేఅవుట్ వేసి భారీ ఎత్తున శంకుస్థాపనలు జరగడానికి ప్రధాన కారణం రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు శాఖ మంత్రి శ్రీ కొడాలిశ్రీ వెంకటేశ్వరరావు (నాని) ఎంతో కృషి చేశారన్నారు. మొదటి రోజు 1074, రెండవ రోజు 1074 మూడవ రోజు 786 ఇళ్లకు లబ్దిదారులు శంకుస్థాపన చేయనున్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమీషనరు సంపత్ కుమార్, హౌసింగ్, రెవెన్యూ, హౌసింగ్ అధికారులు లబ్దిదారులు పాల్గొన్నారు.