1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Rising corona cases in Tirupati

తిరుపతిలో పెరుగుతున్న కరోనా కేసులు

corona cases
తిరుపతి నగరంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, అందరూ కొవిడ్‌ నిబంధనలు పాటించడం ద్వారా వైరస్‌ వ్యాప్తి నివారణకు సహకరించాలంటూ కార్పొరేషన్‌ కమిషనర్‌ గిరీష కోరారు. వారం ముందువరకు 2.5శాతం పాజిటివిటీ రేటు ఉండగా ఇప్పుడు 3.5గా నమోదు కావడం ఆందోళన కల్గిస్తోందన్నారు.

ప్రజలు నిర్లక్ష్యంగా ఉండడమే కేసుల  పెరుగుదలకు కారణంగా కనిపిస్తోందన్నారు. కొవిడ్‌ లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్ష చేసుకోవాలని, ఒకవేళ పాజిటివ్‌ వచ్చి ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా విష్ణునివాసంలోని కొవిడ్‌ సెంటర్‌కు వెళ్లాలని కోరారు. అక్కడ అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు.

వ్యాక్సిన్లు వేసుకున్నాం కదా... ఏమీకాదని నిర్లక్ష్యంగా తిరగవద్దన్నారు.అర్హులైన వారందరూ వ్యాక్సిను వేసుకోవాలన్నారు. ఇప్పటివరకు 2,08,764 మందికి వ్యాక్సిన్‌ వేయడం జరిగిందన్నారు. షాపింగ్‌ మాల్స్‌, బస్టాండ్లు, దుకాణాల్లో అప్రమత్తం చేయడం జరిగిందని, మాస్కులేని వారికి జరిమానా విధిస్తున్నామని చెప్పారు. 
తర్వాతి కథనం
తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు